నేటి సాక్షి చిలుకూరు *చిలుకూరు సీఎం కప్ క్రీడలు ప్రారంభిస్తున్న ఎంపీడీవో ఎంపీవో సర్పంచ్….* చిలుకూరు సీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో శనివారం మండల స్థాయి సీఎం కప్ క్రీడలను ఎంపీడీవో గిరిబాబు సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు పలు క్రీడల్లో రాణించాలని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దేవత పడతాయని అన్నారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను మండల స్థాయిలో ఎంపిక చేసి నియోజకవర్గ స్థాయి క్రీడలకు పంపనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ముక్కపాటి నరసింహారావు సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య ఉప సర్పంచ్ బెల్లంకొండ నాగయ్య ఎంఈఓ గురవయ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి గ్రామ కార్యదర్శి షరీఫుద్దీన్ పీడీలు సీతారాం రెడ్డి రేణుక బ్రహ్మారెడ్డి ప్రకాష్ శోభన్ బాబు వార్డు సభ్యులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు….





