Friday, February 13, 2026

*సీఎం కప్ జిల్లా స్థాయిలో నవజ్యోతి విద్యార్థిని విజయం** రాష్ట్ర స్థాయి పోటీలకు సహర్షిత ఎంపిక—*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల మండలంలో నిర్వహించిన సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో కోరుట్ల పట్టణానికి చెందిన నవజ్యోతి హైస్కూల్ విద్యార్థిని ఎస్. సహర్షిత ప్రతిభ చాటుకుంది. ఈ పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు గౌరవకారణంగా నిలిచింది.*ప్రతిభకు ప్రశంసలు*ఎస్. సహర్షిత (తండ్రి ఎస్. పవన్ కుమార్) జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి విజేతగా నిలవడంతో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు. ఏఈ భూక్యా శ్రీనివాస్, సబ్ ఇంజినీర్ ఆకుల వరప్రసాద్, ఎఫ్‌ఎం బండ రాజావీరు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ కోరుట్ల సభ్యులు ఆమెను అభినందించారు.*రాష్ట్ర స్థాయిలో విజయమే లక్ష్యం*పాఠశాల ప్రిన్సిపాల్ సుజాత సుకుమారన్, ఉపాధ్యాయులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర స్థాయిలో కూడా విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. ఈ విజయానికి కృషి చేసిన పీఈటీ సాయి కుమార్‌ను కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా అభినందించారు.జిల్లా స్థాయిలో సాధించిన ఈ విజయం రాష్ట్ర స్థాయిలో మరింత ప్రతిభ కనబరిచే దిశగా సహర్షితకు ప్రేరణగా నిలుస్తుందని పాఠశాల వర్గాలు తెలిపాయి.____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News