Thursday, March 5, 2026

*సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు** మెట్‌పల్లి అభివృద్ధి అంశాలపై చర్చ—–*

నేటి సాక్షి – మెట్ పల్లి*( రాధారపు నర్సయ్య )తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా వారు సీఎం‌ను కలిసి ఆశీర్వాదాలు పొందారు.*గెలుపుపై అభినందనలు*మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్‌గా మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్‌గా ఓంకారి నవీన్ కుమార్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావుతో కలిసి సీఎం‌ను కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నూతన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు.*అభివృద్ధి ప్రణాళికలపై చర్చ*మెట్‌పల్లి మున్సిపల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు, మౌలిక వసతుల అభివృద్ధి, శుద్ధి నీటి సరఫరా, రహదారుల విస్తరణ, పారిశుద్ధ్య వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై సీఎం‌తో చర్చించినట్లు వారు తెలిపారు. పట్టణాన్ని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరారు.*ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం*మెట్‌పల్లిని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపల్‌గా నిలబెట్టేందుకు కృషి చేస్తామని చైర్మన్, వైస్ చైర్మన్లు స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News