Tuesday, March 17, 2026

* *సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్ళాలి* *ఢిల్లీకి బీసీ రిజర్వేషన్ ఉద్యమ సెగ తగలాలి*: *బీసీ జేఏసీ చైర్మన్ రమేష్ రూపునర్*

నేటి సాక్షి. కొమురం భీం ఆసిఫాబాద్ బీసీలకు రాజ్యాంగబద్ధంగా ఉద్యోగ, విద్య రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద బీసీల ధర్మ పోరాట దీక్ష శ్రీ రమేష్ రూపునర్ చైర్మన్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బీసీ జేఏసీ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గౌ. శ్రీ అజ్మీరా శ్యామ్ నాయక్ గారు మరియు mrps జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ. రేగుంట కేశవ్ గారు మద్దతు తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధనే లక్ష్యంగా ఈరోజు రాష్ట్ర రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపుమేరకు బీసీల ధర్మపోరాట దీక్ష చేయడం జరుగుతున్నది.బీసీ రిజర్వేషన్ సాధన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిల పక్షాన్నిబీసీలకు 42% రిజర్వేషన్లు సాధనే లక్ష్యంగా ఈరోజు రాష్ట్ర రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపుమేరకు బీసీల ధర్మపోరాట దీక్ష చేయడం జరుగుతున్నది.బీసీ రిజర్వేషన్ సాధన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిల పక్షాన్ని ఢిల్లీ కి తీసుకెళ్లి కేంద్రం పై వత్తిడిపెంచాలి వచ్చే పార్లమెంట్ సమావేశాలలో బీజీ రిజర్వేషన్ల అంశంపై రాహుల్ గాంధీ ఇండియా కూటమి నేతలతో సమన్వయం చేసుకొని పార్లమెంటు స్తంభింపజేసి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదాకా పార్లమెంట్ సమావేశాలు వేదికగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం బీసీలు తరపున రాజకీయ పోరాటం కొనసాగించాలి. బీసీల మాట పెడచెవిన పెట్టి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామంటే బీసీలు తాడోపేడో తెలుసుకోవాల్సి వస్తుంది. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేసి, ఈడబ్ల్యూఎస్ జనాభా కంటే ఎక్కువగా 10 శాతం రిజర్వేషన్లు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పెట్టి కేంద్రానికి పంపితే రాష్ట్రపతి గవర్నర్ గారు పెండింగ్ పెట్టారు. రెడ్డి జాగృతి నాయకులు హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించి తినే అన్నంలో మన్ను కలిపినట్టు చేసినారు. రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయకపోతే తెలంగాణ ఉద్యమ తరహాలో ఈ నెల 16న రన్ ఫర్ సోషల్ జస్టిస్, ఈనెల 18న ఎంపీలతో ములాఖత్, 23న డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంటు ముట్టడి, డిసెంబర్ మూడో వారంలో బస్సు యాత్ర జనవరి 4న వేలవృత్తులు – కోట్ల గొంతులు అనే నినాదంతో హైదరాబాదులో భారీ బహిరంగ సభ నిర్వహించుటకు రాష్ట్ర జేఏసీ ద్వారా పిలుపునివ్వడం జరిగింది. ఢిల్లీ కి తీసుకెళ్లి కేంద్రం పై వత్తిడిపెంచాలి వచ్చే పార్లమెంట్ సమావేశాలలో బీజీ రిజర్వేషన్ల అంశంపై రాహుల్ గాంధీ ఇండియా కూటమి నేతలతో సమన్వయం చేసుకొని పార్లమెంటు స్తంభింపజేసి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదాకా పార్లమెంట్ సమావేశాలు వేదికగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం బీసీలు తరపున రాజకీయ పోరాటం కొనసాగించాలని బీసీ జేఏసీ చైర్మన్ రమేష్ గారు డిమాండ్ చేశారు.బీసీల మాట పెడచెవిన పెట్టి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామంటే బీసీలు తాడోపేడో తెలుసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేసి, ఈడబ్ల్యూఎస్ జనాభా కంటే ఎక్కువగా 10 శాతం రిజర్వేషన్లు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పెట్టి కేంద్రానికి పంపితే రాష్ట్రపతి గవర్నర్ గారు పెండింగ్ పెట్టారు. రెడ్డి జాగృతి నాయకులు హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించి తినే అన్నంలో మన్ను కలిపినట్టు చేసినారని మండి పడ్డారు. రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయకపోతే తెలంగాణ ఉద్యమ తరహాలో ఈ నెల 16న రన్ ఫర్ సోషల్ జస్టిస్, ఈనెల 18న ఎంపీలతో ములాఖత్, 23న డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంటు ముట్టడి, డిసెంబర్ మూడో వారంలో బస్సు యాత్ర జనవరి 4న వేలవృత్తులు – కోట్ల గొంతులు అనే నినాదంతో హైదరాబాదులో భారీ బహిరంగ సభ నిర్వహించుటకు రాష్ట్ర జేఏసీ ద్వారా పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ జేఏసీ కోఆర్డినేటర్ ప్రణయ్ కుమార్, బీసీ జేఏసీ వైస్ చైర్మన్లు గాజుల జక్కన్న, పొన్న రమేష్, మేరాజ్ భాయ్, వైరాగడి మారుతి పటేల్, నికోడె రవీందర్ అడ్వకేట్ గారు, జై భీమ్ సంఘ నాయకుడు ఝాడే అశోక్, గంగపుత్ర సంఘ నాయకుడు మోరేశ్వర్, నాయి బ్రాహ్మణ సేవా సంఘ నాయకుడు జూలూరి శంకర్,అఖిలభారత మాలిమహా సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నాగోశే శంకర్, బీసీ సంక్షేమ సంఘం ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షుడు బొట్టుపల్లి ప్రశాంత్, ఆరే సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొట్టుపల్లి జయరాం, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గురునులే మెంగజీ గారు, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లోబడే లహు కుమార్, ఆరే సంక్షేమ సంఘం నాయకుడు బొట్టుపల్లి శ్యామ్ రావు, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు సిరికొండ సాయి కృష్ణ, సండే నామ్ దేవ్, నికోరే హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News