*నెటిసాక్షి సిరిసిల శివకుమార్* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెప్పుకోసమే విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇది కేవలం పరిపాలనా నిర్ణయం కాదని, స్పష్టమైన రాజకీయ ప్రతీకార చర్య కంచర్ల రవి గౌడ్ మండిపడ్డారు. సోమవారం సిరిసిల్ల తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవిగౌడ్ మాట్లాడారు.తెలంగాణ విద్యారంగాన్ని స్వర్ణయుగంగా మలిచిన మహానాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పై కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగంపై దాడి చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలనే రాజకీయ కుట్రలో భాగంగానే గురుకులాలు, విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలపై అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్కరణలను బలహీనపరచడం వెనుక స్పష్టమైన రాజకీయ కోణం ఉందని తెలిపారు. ఇది అభివృద్ధి వ్యతిరేక దృక్పథమే కాకుండా, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమని తీవ్రంగా ఖండించారు.





