**నేటి సాక్షి, ఎండపల్లి: ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహయం రూ. 27.85 లక్షల విలువైన చెక్కులను స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం 96 మంది లబ్దిదారులకు అందించారు. ఈ సందర్బంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…వేలాది మంది పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా అర్థిక సహయం అందిస్తున్నామని ఇది పేదలకు వరం అని అయన అన్నారు. ప్రజల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లవేళల తోడ్పాటు అందిస్తుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అనిల్ కుమార్, ఉమ్మడి మండల ఎంపీడీఓ లు, గిర్థావర్ రాజేశ్వరి, ఏఎంసీ చైర్మన్ గుండాటి గోపిక, వైస్ చైర్మన్ తిరుపతి, తాజా మాజీ ఎంపీటీసీ సభ్యలు మంజుల, తిరుపతి, నాయకులు పూదరి రమేష్, సందీప్ రెడ్డి, బిసగోని సత్యం, భూమయ్య, మహిపాల్ రెడ్డి, జక్కుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

