నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ జిల్లా సిఐటియు కార్యాలయంలో సిఐటియు జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈశ్వరరావు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లాలో ఉన్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కార్మికులు కర్షకులు ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున పోరాడాలని చెప్పి పిలుపునిచ్చారు.సిఐటియు నూతన వికారాబాద్ జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది.జిల్లా అధ్యక్షులు పి రామకృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాస్ జిల్లా కోశాధికారి బి చంద్రయ్య జిల్లా ఉపాధ్యక్షులు మైపాల్ , నర్సమ్మ. సహాయ కార్యదర్శి మంగమ్మ ,శరణప్ప18 మందితో కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ ఆశ వర్కర్స్ గ్రామపంచాయతీ కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు కాంట్రాక్టు ఏఎన్ఎంలు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, భవన నిర్మాణం రంగం,హాస్టల్ వర్కర్స్, ఎలక్ట్రిసిటీ,ఎంప్లాయిస్ తదితరులు పాల్గొన్నారు.





