నేటిసాక్షి : తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ సూచనల మేరకు పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలోని ఎకోక్లబ్ మరియు బోటనీ విభాగం సంయుక్తంగా సీడ్ బాల్ తయారీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీడ్ బాల్స్ తయారీ విధానం మరియు వాటి ప్రాముఖ్యత గురించి, ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఎకోక్లబ్ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, ఎకోక్లబ్ కన్వీనర్ వి. శిరీష, బోటనీ విభాగాధిపతి కే. శివరాణి, సభ్యులు డా. పి. సిద్ధేశ్ గౌడ్, డా. డి. కృష్ణ , ఇతర బోధన సిబ్బంది మరియు విద్యార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు.





