నేటి సాక్షి మహబూబాబా ద్ (భూక్యా రవి నాయక్) జనవరి 23కురవి మండలం నేరడ గ్రామానికి చెందిన సీనియర్ బీఆర్‌ఎస్ నాయకుడు, కురవి ఆంధ్ర బ్యాంక్ సొసైటీ చైర్మన్, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్డి నాయక్‌కు అత్యంత సన్నిహితుడైన దొడ్డ గోవర్ధన్ రెడ్డి పరమపదించారు. ఆయన మృతి వార్త వెలువడగానే నేరడ గ్రామంతో పాటు కురవి మండలమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.సామాజిక, రాజకీయ రంగాల్లో గోవర్ధన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. పార్టీ కార్యకర్తగా మొదలై, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండే వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది. గ్రామాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన నేతగా స్థానికులు ఆయనను గుర్తుచేసుకుంటున్నారు.గోవర్ధన్ రెడ్డి భౌతికాయానికి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్డి నాయక్ స్వయంగా హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన చిరకాల మిత్రుడిని కోల్పోయిన బాధ తన మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.ఈ నివాళుల కార్యక్రమంలో బజ్జూరి పిచ్చి రెడ్డి, మాజీ ఎంపీపీ గుగులోతు పద్మావతి, రవి నాయక్, గుండోజు శ్రీనివాస్, చేరెడ్డి భిక్షం రెడ్డి, తాళ్లపల్లి రఘు, ముండ్ల రమేష్, నామ సైదులు, ఎండి అయూబ్ పాష, కొండపల్లి శ్రీదేవి, డాక్టర్ రవీందర్, జాటోత్ ఈశ్వరి, బానోతు రమేష్, మంగీలాల్, సింగ్ నాయక్ తదితర ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.గోవర్ధన్ రెడ్డి మృతి తీరని లోటని, ఆయన సేవలు నేరడ గ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పలువురు నేతలు కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.





