వేములకుర్తి గ్రామంలో కోట శ్రీనివాసరావు మృతి నివాలి లో
తెలంగాణ రాష్ట్ర సినీ నిర్మాత భరత్ కుమార్ అంకతి
పదశ్రీ అవార్డు గహిత,విలక్షణ సీనియర్ సినీ నటుడు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు ప్రజల మదిలో అయన చిరస్మరణీయం గా తెలుగు ప్రజల గుండెల్లో స్ధానం సంపదించుకోన్నారని తెలంగాణ రాష్ట్ర సినీ నిర్మాత భరత్ కుమార్ అంకతి అన్నారు. అదివారం జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని వేములకుర్తి గ్ర్రామం లో కోట శ్రీనివాసరావు మృతి పట్ల గ్రామ కుడలిలో అయన చిత్ర పటాన్ని ఎర్పాటు చేసి నివాల్లు అర్పించారు. ఈసందర్భంగా నిర్మాత భరత్ కుమార్ మాట్లాడుతు కృష్ణా జిల్లా కంకిపాడులో 1942,జులై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన అయన ఆహా నా పెళ్లంట సినిమాతో తిరుగులేని నటుడిగా కొనసాగిన కోట ప్రతిఘటన చిత్రంలో విలన్గా మంచి గుర్తింపు పొంది సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పని చేసిన కోట శ్రీనివాసరావు 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికైన అయనకు 2015లో కోట శ్రీనివాసరావు కు పద్మశ్రీ పురస్కారం 9 నంది అవార్డులు అందుకున్న మహ నటుడు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు మరణం సినిమా రంగంలో నే కాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో తివ్ర విషాదం నిప్పిందన్నారు.అయన మృతి పట్ల సంతపం ప్రకటించారు. నివాల్లు అర్పించిన వారిలో సినిఆర్టిస్ట్ లు రాధరపు ప్రభాకర్, అరె రమేష్, కళభిమానులు కారం ఇంద్రయ్య,అరె సురేందర్, పుప్పాల రాజేష్, బుక్య కైలాష్, అందుగుల నాగేష్,బస మల్లేశ్,అందుగుల ప్రవిణ్,దోనికెన జగదిష్ తదితరులు ఉన్నారు.