–ప్రతి కార్యకర్తకు సీపీఐ అండగా ఉంటుంది.
–మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి
-వేల్పుల బాలమల్లు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించిన సీపీఐ పార్టీ
నేటి సాక్షి, కోహెడ : సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వేల్పుల బాలమల్లు పార్టీకి చేసిన సేవలు మరువలేనివని,పార్టీకి నిబద్ధతతో పని చేసారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు..సీపీఐ పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్తకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. మండలంలోని సముద్రాల గ్రామంలో ఆదివారం నిర్వహించిన బాలమల్లు దశదినకర్మకు హాజరైనా చాడ మృతుని కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు.. ఈ కార్యక్రమంలో సిద్దిపేట సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లేష్, సిపిఐ నాయకులు బోయిని అశోక్, కనుకుంట్ల శంకర్, ఎడల వనేష్,ముంజ గోపి, గూడెం లక్ష్మి,పిల్లి రజిని,వేల్పుల శ్రీనివాస్, జేరిపోతుల జనార్ధన్,బోనగిరి రూపేష్,బూడిద సదాశివ, బోనగిరి మహేందర్,రామగళ్ల నరేష్, వేల్పుల ప్రసన్నకుమార్,చిట్యాల శేఖర్, మాజీ సిపిఐ నాయకులు పెండాల ఐలయ్య మండల సీపీఐ నాయకులు బండారు లక్ష్మణ్, తాళ్లపల్లి ఎల్లయ్య,పోచయ్య,పార్టీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు..

