మా బాధ జర పట్టించుకోండి కార్యదర్శి గారు • పలుమార్లు చెప్పిన పట్టించుకోని అధికారులు. నేటి సాక్షి కి ఆశ్రయించిన బాధితులు..
నేటి సాక్షి కోదాడ (అనంతగిరి)
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామంలో గల 3,4వ వార్డుల్లో
కొన్ని నెలలుగా డ్రైనేజీ నీళ్లు సిసి రోడ్డుపై ప్రవహిస్తూ రోడ్డు అంతా పాకురు పట్టి ప్రమాదకరంగా మారిందని స్థానికులు,చిన్నపిల్లలు,వృద్ధులు, వాహనదారులు రోడ్డుపై జారిపడి ప్రమాదాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు స్థానికులు కార్యదర్శి నరేష్ ను రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగు నీటిని, డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు.వర్షాకాలం చిన్నపాటి పంట కాలవను తలపిస్తుందని తద్వారా రాకపోగాలకు అంతరం ఏర్పడడం కాకుండా మురుగునీరు రోడ్డుపై పారడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వారు. వార్డుల్లో స్థానికులకు ఈ మురికి దుర్వాసనతో ప్రతి ఇంటికి జ్వరాల బారిన పడ్డారని ఇట్టి విషయంపై స్థానిక కార్యదర్శికి అనేకమార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆరోపించారు. కొందరు మిషన్ భగీరథ తోపాటు గ్రామపంచాయతీ నీటిని నల్లాలను కట్టివేయకుండా రోడ్డుపైకి వదల తో పాటు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతున్నప్పటికీ పరిష్కరించడంలో గ్రామపంచాయతీ వారి విప్లమయ్యారని దీని ద్వారా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు అన్నారు.ప్రజా సమస్యలను పరిష్కరించే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉన్నత అధికారులు ఈ విషయంపై చొరవ చూపి తక్షణమే సమస్యకు పరిష్కారాన్ని చూపించాలని వారు కోరుతున్నారు.





