నేటి సాక్షి చిలుకూరు: చిలుకూరు మండలం ఆచార్యులగూడెం గ్రామంలో 8 లక్షల ఎస్డిఏఫ్ నిధులతో సొసైటీ గోడౌన్ నుండి బీసీ స్మశాన వాటిక వరకు సిసి రోడ్డు నిర్మాణ కార్యక్రమం, గ్రామంలో నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవం గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి లక్ష్మీ బిక్షం, ఉప సర్పంచ్ నెమ్మది వీరబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది.గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే సహాకారంతో అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం,పంచాయతీ కార్యదర్శి రామారావు, గ్రామ పెద్దలు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





