నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ఏడాదిలో సంక్షేమం, అభివృద్ధి పై సమీక్ష, కూటమి ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణను పై అమరావతిలో ఏర్పాటు చేసిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గంలో నుంచి ముఖ్యమైన ప్రజా ప్రతినిధితో పాటు అధికార యంత్రాంగం పాల్గొంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏడాది పాలనలో తీసుకొచ్చిన అభివృద్ధి, సూపర్ సిక్స్ పథకాల అమలు, స్వర్ణాంధ్ర విజన్ 2047ను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, చెప్పిన విషయాలను పూర్తిగా అవగతం చేసుకున్నామన్నారు.