మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీ* నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవ ర్యాలీని తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయ్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి కూడా శిక్షలు పడేలా స్వతంత్ర దర్యాప్తు చేయాలి. అందుకోసం సుప్రీం కోర్టులో ప్రజాస్వామికవాదులుగా గుర్తించబడ్డ సినియర్ జడ్జిలతో విచారణ చేయించాలన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఇన్చార్జి వావిళ్ళ శివయ్య, దేవదాసు తిరుపతి ఎమ్మార్పీఎస్ నాయకులు మాసారుపు గోపి, కారుమంచి మధు తదితరులు పాల్గొన్నారు





