Thursday, March 12, 2026

సూది మందు వికటించి విద్యార్థి మృతి…

నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న
షేక్ సుహానా (14)…

  • మూడు రోజుల నుండి జ్వరం తో బాధపడుతున్న సుహానా…
  • గ్రామంలో ఆర్ఎంపి వద్ద చికిత్స చేస్తుండగా అపస్మారక స్థితి లోకి వెళ్లిన బాలిక సుహానా…

నేటి సాక్షి కోదాడ ప్రతినిధి:

ఆర్ ఎం పి వైద్యం వికటించి విద్యార్థిని మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని బేతవోలు గ్రామంలో చోటుచేసుకుంది. బడే సాహెబ్, బంధుమిత్రులు తెలిపిన వివరాల ప్రకారం… నడిగూడెం కస్తూర్బా స్కూల్లో సుహాన (13) 8వ తరగతి చదువుతుంది. మూడు రోజుల క్రితం జ్వరం వస్తుందని ఇంటికి వచ్చింది. గ్రామంలో ఆర్ఎంపి డాక్టర్ ను ఆశ్రయించగా జ్వరానికి సంబంధించిన టెస్టులు చేపించుకొని రమ్మని తెలిపారు. టెస్టులన్నీ ఆర్ఎంపి డాక్టర్ కు చూపించగా ఎక్కువ మోతాదులో ఇంజక్షన్ ఇవ్వడంతో అక్కడికక్కడే ఫిట్స్ వచ్చి మృతి చెందిందని మేనమామ బడే సాహెబ్ అన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News