Thursday, March 19, 2026

*సెషన్స్ కోర్టుల ఏర్పాటు విషయంలో ఎన్డీఏ సర్కార్ అవలంబిస్తున్న విధానాలు ఏంటి*..?*గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సెషన్స్ కోర్టుల స్థాపనకు మంజూరు చేసిన నిధులు, వాటి వివరాలు* *కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు**సానుకూలంగా స్పందించిన భారత ప్రభుత్వ చట్టం,న్యాయ శాఖ*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)—————————-చిత్తూరు (ఢిల్లీ)-13-12-25—————————-ఆంధ్రప్రదేశ్లో నూతనంగా విభజించిన జిల్లాలో సెషన్స్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి, ప్రభుత్వం అవలంబిస్తున్న విధి ,విధానాలను తెలియజేయాలని ఎన్డీఏ సర్కార్కు విజ్ఞప్తి చేశారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.గత ఐదేళ్లలో ఏపీలో సెషన్స్ కోర్టుల పునః విస్తరణకు, మంజూరు చేసిన నిధులు, వాటి వివరాలను తెలియజేయాలని ఆయన భారత ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ కూటమి ఎంపీలు చేసిన విన్నపాన్ని మన్నించిన కేంద్ర చట్టం,న్యాయ శాఖ తక్షణం స్పందించిదనీ.., తాము కోరిన సమాచారాన్ని అందించినట్లు చిత్తూరు ఎంపీ తెలియజేశారు.న్యూఢిల్లీ పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరైన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.., తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు పార్లమెంటు అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, దీనికి సంబంధించిన నిధులను రాబట్టేందుకు సహచర ఎంపీల బృందంతో కలిసి, తన వంతు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో సెషన్స్ కోర్టులు ఏర్పాటు, కొత్తగా ఏర్పడిన జిల్లాల సంఖ్య, కొత్త జిల్లాల్లో సెషన్స్ కోర్టులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి అందిన ప్రతిపాదనలు, ఆమోదానికి సంబంధించిన తాజా పరిస్థితి, ఏర్పాటుకు గడువులు, గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో సెషన్స్ కోర్టుల ఏర్పాటు, మంజూరు కోసం విడుదల చేసిన నిధులు, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో సెషన్స్ కోర్టుల కార్యాచరణ, ఆలస్యమవుతున్న మౌలిక సదుపాయాలు, పరిపాలనా లేదా న్యాయపరమైన అంశాలను ప్రభుత్వం గుర్తించిందా..? అన్న వివరాలను జిల్లాల కోరారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.ఇందుకు వెంటనే స్పందించిన కేంద్ర చట్టం, న్యాయ శాఖ సహాయ మంత్రి,పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ .. ఏపీ కూటమి ఎంపీల బృందం కోరిన అంశాలకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చినట్లు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు మీడియాకు వెల్లడించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 235 ప్రకారం, జిల్లా కోర్టులు, దాని కింద ఉన్న కోర్టుల పై నియంత్రణ, జిల్లా జడ్జి అంతకంటే తక్కువ పదవిలో ఉన్న ఏదైనా పోస్ట్‌తో పాటు, రాష్ట్ర జుడిషియల్ సర్వీస్‌కు చెందిన వ్యక్తుల పోస్టింగ్, ప్రమోషన్, సెలవు మంజూరుతో సహా హైకోర్టు పరిధిలో ఉంటుందని సంబంధిత శాఖ వివరణ ఇచ్చినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి అందించిన సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల్లో సెషన్స్ కోర్టుల ఏర్పాటు విషయంలో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోందనీ, కేంద్ర ప్రభుత్వం 1993-94 నుండి జిల్లా , అధీన కోర్టులలో న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రాయోజిత పథకాన్ని అమలు చేస్తోందని కేంద్ర చట్టం, న్యాయ శాఖ సహాయ మంత్రి,పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జవాబు ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం, రాష్ట్రం మధ్య నిధుల పంపిణీ నిష్పత్తి 60:40 అనీ, ఈ పథకం ప్రారంభం నుండి ఆంధ్రప్రదేశ్‌కు ₹286.37 కోట్ల కేంద్ర సహాయం అందించిందనీ.., ఇందులో ₹126.73 కోట్లు 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని తమకు కేంద్ర న్యాయశాఖ తెలియపరచినట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు వివరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News