- వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
నేటి సాక్షి, వరంగల్: ఉద్యోగ విరమణ అనంతరం పోలీస్ అధికారులు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు. వరంగల్ పోలీస్ విభాగంలో సుదీర్ఘకాలంగా విధులు నిర్వహించి శుక్రవారం ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీస్ అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ ఘనంగా సత్కరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారుల సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ చేస్తున్న ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, ఎస్సై మునిరూల్లా, ఏఎస్సైలు సమ్ములాల్, శ్యామ్‌సుందర్, సమ్మయ్య, హెడ్‌కానిస్టేబుల్ యాకుబ్ రెడ్డికి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా పోలీస్ శాఖలో పనిచేయడమే కాకుండా క్లిష్ట సమయాల్లో విధులు నిర్వహించి, నేడు శాంతియుతమైన వాతారణం కల్పించడంలో వీరు ప్రధాన కారుకులని, నేటి తరం పోలీసులకు వీరు స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పారు. ముఖ్యంగా పోలీసులు తమ విధుల్లో రాణించడం ప్రధాన కారణం వారి కుటుంబ సభ్యులని, కుటుంబ సభ్యులు ఇచ్చిన సహకారంతోనే పోలీసులకు అప్పగించిన పనుల్లో రాణిస్తున్నారని, ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఆరోగ్య పరి రక్షణకై నిరంతరం వ్యాయామం, యోగ సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమములో ట్రైనీ ఐపీఎస్ శుభం నాగ్, అదనపు డీసీపీలు రవి, సంజీవ్, సురేష్‌కుమార్, ఏసీపీ అనంతరయ్య, ఆర్‌ఐలు శ్రీధర్, స్పర్జన్‌రాజ్, చంద్రశేఖర్, ఆర్ఎస్సై శ్రవణ్ కుమార్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శోభన్‌కుమార్‌తో పాటు ఉద్యోగ విరమణ చేసిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.