Friday, March 13, 2026

సేవా పథంలో లయన్స్ ముందంజ…..జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకు మైక్ సెట్ విరాళం

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )సమాజ సేవే ధ్యేయంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల చేపట్టిన సేవా కార్యక్రమం ఘనంగా జరిగింది. కోరుట్ల పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, కల్లూరు రోడ్ ప్రాంగణంలో మైక్ సెట్‌ను విరాళంగా అందజేశారు.*మంచాల జగన్ దాతృత్వం ప్రశంసనీయం*లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G చీఫ్ కోఆర్డినేటర్, సేవా తపనతో ముందుండే లయన్ మంచాల జగన్ గారు విద్యార్థుల అవసరాన్ని గుర్తించి స్వయంగా మైక్ సెట్‌ను అందించారు. ఆయన చేసిన ఈ దాతృత్వం పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, లయన్స్ సభ్యులు హర్షంగా స్వాగతించారు.ఈ సందర్భంగా లయన్ జగన్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ..’విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి మైక్ సెట్ ఎంతో అవసరం. ఈ అవసరాన్ని తీర్చిన లయన్స్ క్లబ్, ముఖ్యంగా లయన్ మంచాల జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాల’ని పేర్కొన్నారు.పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొని చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ, ‘ఇకపై పాఠశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు మరింత ఉత్సాహభరితంగా సాగుతాయ’న్నారు.*లయన్స్ క్లబ్ సేవా భావం కొనసాగుతుంది*క్లబ్ అధ్యక్షులు లయన్ కొమ్ముల జీవన్ రెడ్డి మాట్లాడుతూ..’లయన్స్ క్లబ్’ కేవలం సేవా సంస్థ మాత్రమే కాదు. సమాజంలో ఎక్కడ అవసరం ఉందో అక్కడ సహాయహస్తం అందించే వేదిక. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామ’ని తెలిపారు.ఈ కార్యక్రమం నిర్వహణలో కార్యదర్శి లయన్ ఏలేటి లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు లయన్ గుంటుక మహేష్ పాల్గొన్నారు. సభాధ్యక్షులుగా హెడ్‌మాస్టర్ వడ్లకొండ గంగాధర్ వ్యవహరించారు.______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News