( నేటి సాక్షి):మహాలింగాపురం గ్రామ సర్పంచ్ మాచన్నగారి రాఘవేందర్ రెడ్డి తన మానవత్వం, సేవాభావానికి మరోసారి నిదర్శనంగా నిలిచారు. గ్రామానికి చెందిన కోనాపురం వెంకటమ్మ గత పదేళ్లకు పైగా స్వంత నివాసం లేకుండా నిరాశ్రయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు. ఆమె కష్టాలను గమనించిన సర్పంచ్, ఆమెకు స్వంత గృహం ఉండాలనే ఉద్దేశంతో తన వ్యక్తిగత చొరవతో కొత్త ఇల్లు నిర్మించాలని నిర్ణయించారు. ఆ సంకల్పానికి అనుగుణంగా నిర్మాణ పనులు పూర్తి చేసి, గురువారం ఆ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆశీస్సులు అందజేశారు. నిరాశ్రయురాలైన వెంకటమ్మకి స్వంత నివాసం కల్పించిన ఈ సేవా కార్యక్రమం అందరి హృదయాలను తాకింది. సామాజిక బాధ్యతతో, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న నూతన సర్పంచ్ మాచ్చన్నగారి రాఘవేందర్ రెడ్డి ఈ మంచి కార్యానికి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని, వాటికి పరిష్కారం చూపుతున్న ఆయన సేవా దృక్పథం భవిష్యత్తులో మరెన్నో మంచి పనులకు దారి తీస్తుందని గ్రామ పెద్దలు ఆశాభావం వ్యక్తం చేశారు.

