నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల గొల్లపల్లి యొక్క స్థల పరిశీలన కొరకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశానుసారం బుధవారం రోజున సాంఘీక మరియు మైనారిటీ పాఠశాలల సిఈ ఎండి షఫీమియా స్థల పరిశీలన చేశారు. ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి ఈఈ అశోక్ కుమార్ డిఈ సత్యనారాయణ ఏఈ శ్రీకాంత్ స్థానిక నాయకులు గురజాల బుచ్చిరెడ్డి భీమ మహిపాల్ నేరెళ్ల మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.





