నెటి సాక్షి,బాపట్ల జిల్లా ప్రతినిధి ప్రపంచ న్యుమోనియా దినోత్సవం సందర్భంగా “సోషియల్ అవేర్‌నెస్ అండ్ యాక్షన్ ఆన్ న్యుమోనియా” కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు.జిల్లా కలెక్టరేట్ లోని వి సి హల్ నందు సోషియల్ అవేర్‌నెస్ అండ్ యాక్షన్ ఆన్ న్యుమోనియా పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.న్యుమోనియా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. చిన్నారుల్లో న్యుమోనియా మరణాలను తగ్గించేందుకు టీకాలు, శుభ్రత, సమయానుకూల వైద్యం కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా డి యం & హెచ్ ఓ డాక్టర్ విజయమ్మ, వైద్య శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




