*నేటి సాక్షి-మేడిపల్లి* గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 60,000 రూపాయల విలువైన మైక్ సెట్ బాక్సులను మన్నెగూడం వాసియైన తేలు నరేష్ స్పాన్సర్ చేశారు. ఈ బహూకరణ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందం ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.స్థానిక భీమారం గ్రామ సర్పంచ్ చెక్కపెల్లి స్వాతి సంజీవ్, ఒడ్డాడు గ్రామ సర్పంచ్ బొమ్మన ప్రశాంత్, నాయకులు పల్లి అర్జున్,పల్లి సాయి, చిలివేరి వెంకటేష్, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు తేలు నరేష్‌ను అభినందించారు.





