ఒకే చోట చేరిన తెలుగు కుటుంబాలు
నేటిసాక్షి, రాయికల్ :
సౌది ఆరేబియా లోని తెలుగు ఆసోషియేషన్ (సాటా) ఆధ్వర్యంలో రియాద్ నగరంలో ఈద్ ఉల్ ఆధ ఉత్సవాలను సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. తెలుగు కుటుంబాలంతా ఒకే చోట చేరి ఈ ఉత్సవాన్ని జరుపుకున్నారు. సాటా అధ్యక్షులు మచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ కుల మాతాలకతీతంగా అందరు కలిసి ఈ పండుగను జరుపుకోవడం మన ఐక్యతను సూచిస్తుందన్నారు. సాటా వ్యవస్థాపక అధ్యక్షులు మల్లేశం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగగా ఈ ఉత్సవంలో సాటా రియాద్ ఉమెన్ చాప్టర్ అధ్యక్షురాలు శర్వాణి విధ్యాధరణి, వైస్ ప్రెసిడెంట్ నూర్ మహ్మద్, రియాద్, ఇంజనీరింగ్ చాప్టర్ సింగు నరేష్కుమార్, కోర్ టీం సభ్యులు శహబాజ్, మహ్మద్ అబ్దుల్ గఫార్, అయాజ్, మిధున్ సురేష్, ముదిగొండ శంకర్, నయూం, ముజామీలుద్దీన్, ఇలియాస్, కోకిల, మంజూష, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్: 10RKL03: ఒకే చోట చేరి పండుగను జరుపుకుంటున్న తెలుగు కుటుంబాలు