నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ జనరల్ సెక్రటరీ శీను మాట్లాడుతూ నేటి సమాజం విద్యార్థులు నేటి యువత చెడు దారిలో వెళ్లకుండా వారికి కనీసమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి స్కూలు మరియు కాలేజీలలో వాళ్లకు ఫోక్సో చట్టాల పైన అవగాహన కల్పించాలి లేకపోతే యువత చెడుదారుల్లో వెళ్లి కేసులలో బందీలవుతున్నారు ఇప్పటికే ఎంతోమంది మన జిల్లాకు సంబంధించిన విద్యార్థులు చాలా మంది పోక్సో చట్టాల పైన అవగాహన లేక జైల్లో బందీలుగా ఉన్నారు వారికి సరైనటువంటి అవగాహన లేకపోవడం వాళ్లకు సరైనటువంటి నిర్ణయాలను వాళ్ల నిర్ణయం తీసుకోకపోవడం పల్లెల్లో ఉన్న తల్లిదండ్రులకు కూడా అవగాహన లేకపోవడం ఇలాంటి ఎన్నో కారణాలవల్ల నేటి యువత అవగాహన లేక చట్టాల పైన సరైనటువంటి పట్టు లేక ఎంతో మంది విద్యార్థులు తమ భవిష్యత్తులో చదవాల్సిన టైం లో చెడుదారుల్లో వెళ్లి ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కాబట్టి ఉపాధ్యాయులు దయచేసి తమ తమ స్కూళ్లలో మరియు కాలేజీలలో విద్యార్థులకు మొదటిగా ఫోక్సో చట్టాల పైన అవగాహన కల్పించి వాళ్లకు విద్యను నేర్పించే విధంగా ప్రతి ఒక్కరూ సహాయపడాలని వాళ్ళని చెడుదారుల్లో వెళ్ళనివ్వకుండా నీ విద్యార్థులు మీ స్టూడెంట్స్ కాబట్టి అది మీరు బాధ్యతగా తీసుకొని వాళ్ళను రేపటి భవిష్యత్తులో ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దడం తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులదే బాధ్యత కాబట్టి విద్యార్థులు విద్య నేర్పిన ఉపాధ్యాయులను దైవంగా పోలుస్తారు కాబట్టి దయచేసి సరైనటువంటి అవగాహన చెడు దారుల్లో వెళ్ళనివ్వకుండా వాళ్లను ఉత్తీర్ణులుగా చేయాలని స్కూల్స్ ఉపాధ్యాయులను మరియు కాలేజీ ప్రిన్సిపల్, లెక్చలేరులను, ప్రతి ఒక్కరూ తమ తమ స్కూల్స్ కాలేజీలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నాము…





