Wednesday, July 23, 2025

స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర‌ణి , క‌మిష‌న‌ర్ మౌర్య

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)తిరుప‌తిః ఒక‌ట‌వ డివిజ‌న్ ప‌రిధిలోని ప‌ద్మావ‌తిన‌గ‌ర్ లో నిర్మించిన ఎంపిపి స్కూల్ ను బుధవారం ఉద‌యం ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు, క‌మిష‌న‌ర్ నార‌పురెడ్డి మౌర్య ప్రారంభించారు. స్కూల్ ఆవ‌ర‌ణ‌ను ఆయ‌న అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఎన్డీఏ కూట‌మి వ‌చ్చిన వెంటనే స్కూల్ ప‌నులు ప్రారంభించి ఏడాది లోపే ప్రారంభించుకోవ‌డం విద్య‌కు ఎన్డీఏ కూటమి ప్ర‌భుత్వం ఇస్తున్న ప్రాధాన్య‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. విద్యారంగాన్ని అభివృద్ధిప‌రిచి నాణ్య‌మైన విద్య‌ను విద్యార్థుల‌కు అందించేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లు కృషి చేస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ విద్యామిత్ర ప‌థ‌కం కింద ఐద‌వ త‌ర‌గ‌తి నుంచి ప‌ద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్యాసామాగ్రిని విద్యార్థుల‌కు ఉచితంగా ప్ర‌భుత్వం అందిస్తున్న‌ద‌ని ఆయ‌న తెలిపారు. పేద‌రికం చ‌ద‌వుకు అడ్డు రాకూడ‌ద‌ని త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌శేపెట్టింద‌ని ఆయ‌న చెప్పారు. ఈ ప‌థ‌కం నిధుల‌ను నేరుగా విద్యార్థుల త‌ల్లుల ఖాత‌ల‌కు గురువారం స్కూల్స్ ప్రారంభం సందర్భంగా ఇచ్చిన మాట ప్ర‌కారం ప్ర‌భుత్వం జ‌మ‌ చేస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. అలాగే విద్యార్థుల‌కు డొక్కా సీత‌మ్మ మ‌ధ్యాహ్న బ‌డి భోజ‌నం ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తూ డ్రాప్ అవుట్స్ ను పూర్తిగా నియంత్రించేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. కాగా కమిషనర్ ఎన్.మౌర్య మాట్లాడుతూ తిమ్మినాయుడుపాలెం మాస్టర్ ప్లాన్ రోడ్డు వేయడంతో స్కూల్ భవనం తొలగించారని అన్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా చింతలచేను వద్ద స్కూల్ నిర్మించాలని అన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా మండల పరిషత్ స్కూల్ భవన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసి ప్రారంభించామని అన్నారు. ఒకటి నుండి ఐదవ తరగతి వరకు 60 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. వీరందరి ఒక్కో క్లాస్ కు ప్రత్యేకంగా ఒక్కో గది ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ, కార్పొరేటర్ అన్నా అనిత, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి, డి.ఈ.రమణ, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News