Saturday, March 21, 2026

స్కై స్కూల్ విద్యార్థి అఖిల్‌కు రాష్ట్ర స్థాయి బంగారు పతకం– అభినంచిన పాఠశాల యాజమాన్యం

నేటి సాక్షి, వేములవాడ:వేములవాడ పట్టణం సాయినగర్‌లోని స్కై స్కూల్ (SKY SCHOOL) విద్యార్థి వావిలాల అఖిల్ రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో విజయం సాధించాడు. ఏడో తరగతి చదువుతున్న అఖిల్, ఈ నెల 7న జగిత్యాల జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌లో కుమిటీ (ఫైటింగ్) సీనియర్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం అందుకున్నాడు. విద్యార్థి సాధించిన విజయాన్ని స్కై స్కూల్ కరస్పాండెంట్ ఆసరి మహేష్ అభినందించారు. క్రీడా ప్రతిభతో పాటు ధైర్యం, క్రమశిక్షణను అఖిల్ ప్రతిభావంతంగా ప్రదర్శించాడని ప్రశంసించారు. అవార్డు అందుకున్న అఖిల్‌ను పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యతోపాటు ఆత్మరక్షణ నైపుణ్యాల్లో రాణిస్తున్న అఖిల్ ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నాడని యాజమాన్యం పేర్కొంది. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపల్ జమున, ఉపాధ్యాయులు అర్చన, సూపర్వైజర్ రాము తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News