నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చలికాలం లో జ్వరం జలుబు రావడం సాధారణంగా భావించి వైద్యులను సంప్రదించకుండా ఉండకండి గంగాధర నెల్లూరు వైఎస్సార్ సీపీ వైద్య విభాగం అధ్యక్షుడు కోలారు డాక్టర్ వెంకట ప్రకాష్ సూచించారు అదేవిధంగా స్క్రబ్ టైపస్ అనే చిన్న కీటకం వల్ల కూడా జ్వరం, తలతిరగడం ,వాంతులు, ప్లేట్ లెట్స్ పడిపోవడం జరుగుతుంది, ,అశ్రద్ధ చేయడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు రెండురోజుల కన్నా జ్వరం అధికంగా ఉంటే కచ్చితంగా నాణ్యమైన వైద్యులను సంప్రదించాలని ప్రజలను కోరారు మనం చేసే అశ్రద్ధ వల్ల ప్రాణాలు పొవొచ్చు. .సకాలంలో గుర్తించగలిగితే చికిత్స ద్వారా సాధారణ స్థితికి తీసుకొని రావచ్చని అన్నారు





