నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 29కాగజ్ నగర్ మండలం దుర్గానగర్ విలేజ్ నంబర్ 10లో రేషన్ దుకాణం లేక నానా అవస్థలు పడుతున్నామని ఆ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో సుమారు 400 వందల కుటుంబాలు నివాసిస్తున్నాయని తమకు స్థానికంగా రేషన్ దుకానము లేకపోవడంతో ప్రతి నెల రేషన్ సరుకులు సాకాలంలో పొందలేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు.గ్రామంలో చాలా మంది వృద్ధులు ఉన్నారని ప్రతి నెల రేషన్ సరుకులు తీసుకోవడానికి ప్రక్క గ్రామమైన విలేజ్ నంబరు 5 లేదా 9 గ్రామాల్లో ఉన్న రేషన్ దుకాణాలకు సుమారు 3 నుంచి 4 కిలో మీటర్ల మెరా కాలి నడకన వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు.కనీసం తమ సమస్యను చెప్పుకునేందుకు అధికారుల వద్దకు కూడా వెళ్లలేని పరిస్థితుల్లో గ్రామంలో అనేక మంది వృద్ధ లబ్ధిదారులము ఉన్నామని స్థానిక ఎం.ఎల్.ఏ మరియు జిల్లా కలెక్టర్,పౌర సరఫరా అధికారులు దయతలచి తమ గ్రామంలోనే ప్రతి నెల రేషన్ సరుకులు పొందేలా చౌకధరల దుకాణాన్ని ఏర్పాటు చెయ్యాలని కోరుతున్నారు.

