ఏఐసీసీ సెక్రెటరీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి మాజీ ఎంపీ విశ్వనాథన్
నేటి సాక్షి నారాయణపేట, జూన్ 14,
నారాయణపేట జిల్లా డిసిసి అధ్యక్షులైన కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేపట్టడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సెక్రెటరీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్, మాజీ ఎంపీ విశ్వనాథన్ ,టీపీసీసీ నారాయణపేట జిల్లా అబ్జర్వర్లు వేణు గౌడ్, సంధ్య రెడ్డి,జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కోఆర్డినేటర్ ధారాసింగ్ నాయక్ నారాయణపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ విజయ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు సుజేంద్ర శెట్టి పాల్గొన్నారు.
ముందుగా గుజరాత్ లో విమానం పేలి చనిపోయిన వారందరికీ మౌనం పాటించి, ఈ యొక్క ముఖ్య కార్యక్రమాన్ని ఉద్దేశించుకొని రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఖచ్చితంగా నారాయణపేట జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు,జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్స్ మరియు పి ఎస్ ఎస్ సి లు మొదలైనవన్నీంటిని రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని విశ్వనాథన్ చెప్పడం జరిగింది.
ఈనెల 20 లోపుగా డీసీసీ కార్యవర్గం,బ్లాక్, మండలాల అధ్యక్షులందరు కలిసి అబ్జర్వర్ల మరియు జిల్లా డిసిసి అధ్యక్షుడి పర్యవేక్షణలో ఉండి కార్యవర్గాన్ని పూర్తి చేయాలని విశ్వనాథన్ తెలియజేయడం జరిగింది.రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నారాయణపేట జిల్లా కేంద్రంలో మీటింగ్ నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్లు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,నారాయణపేట జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు & ఉపాధ్యక్షులు,టౌన్ అధ్యక్షులు,జిల్లా& మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఏ ఎన్ యు ఐ &సేవాదళ్ అధ్యక్షులు,ఎన్ఎస్ యుఐ అధ్యక్షులు,బీసీ& మైనారిటీ సెల్ అధ్యక్షులు, సెల్ అధ్యక్షులు,జిల్లా కార్యవర్గం,ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

