నేటి సాక్షి నారాయణపేట, అక్టోబర్ 20,కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిరుపేదలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాయని నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే చిట్టెంపర్ణిక రెడ్డి అన్నారు. నారాయణపేట నియోజకవర్గం లోని రామకృష్ణ పల్లి గ్రామ సమీపంలో నిరుపేదలకు భూ పంపిణీ కార్యక్రమం చేసిన లబ్ధిదారులకు వ్యవసాయ పంపు చెట్లు మోటార్లను నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుపేదలను ఆదుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదలను గుర్తించి వ్యవసాయ భూములను భూ పంపిణీ కార్యక్రమం కింద పంపిణీ చేయడం జరిగిందన్నారు. అట్టి నిరుపేదలను గుర్తించి ప్రభుత్వం పంపుసెట్లు మోటార్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 24 లక్షల 57,800 మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇద్దరు రైతుల కలిపి ఒక పంప్ సెట్ లను మోటర్లను ఇవ్వడం జరిగిందన్నారు వాటి ద్వారా వ్యవసాయదారులుగా మార్చేందుకు ప్రభుత్వం లక్ష్యం ఎంచుకున్నదని ఆమె వివరించారు. అదేవిధంగా నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ పథకం కింద గ్రామంలో 40 8 మందిని గుర్తించి ఇండ్లను మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకే దక్కిందని ఆమె గుర్తించారు. అదేవిధంగా గతంలో కిష్టాపూర్ గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రెండు మంచినీటి బోర్లను వేసిన ఘనత ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాధవరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, ఉంగరాల వెంకట్ రెడ్డి, పేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్ సూర్య మోహన్ రెడ్డి, ధన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావలి నరహరి, మండల నాయకులు గోటూరు నాగేశ్వర్రెడ్డి రాజేందర్రెడ్డి దామోదర్ రెడ్డి నరసింహారెడ్డి ముగ్గురాజు, చంద్రారెడ్డి , ఆంజనేయులు, రాఘవేందర్ రెడ్డి ఎలక బాలరాజు కాశీనాథ్ పాపా నాయక్, గోపాల్ శివాజీ రాజన్న ఈడి, అబ్దుల్ కలీల్ , మండల తాసిల్దార్ ఎంపీడీవో,లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ, నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.





