Saturday, April 11, 2026

స్నేహితుడి కుటుంబానికి అండగా..* *మిత్రుడి కుటుంబానికి పూర్వ విద్యార్థుల చేయూత**కుటుంబానికి రూ.50,000 రూపాయల అందజేత**మిత్ర బృందం సభ్యులను అభినందించిన గ్రామస్తులు*

నేటి సాక్షి పాలేరు , అక్టోబర్ 20 :ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన చిన్ననాటి స్నేహితుడి కుటుంబానికి బాల్య మిత్రులు అండగా నిలిచారు. కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చెందిన.. చందన బోయిన గాంధీ మిషన్ భగీరథ కార్మికుడు పనిచేస్తూ.. సకాలంలో వేతనాలు అందక ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే.. గాంధీ కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్దేశంతో.. పాలేరు క్రాంతి విద్యా మందిర్ పాఠశాలలో 1996 నుండి 2006 వరకు చదువుకున్న బాల్యమిత్రులు ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారంతా కలసి సేకరించిన నగదు రూ. 50,000 వేల రూపాయలను వారి కుటుంబానికి ఆదివారం మిత్ర బృందం సభ్యులు అందజేశారు. ఎంతో సేవా దృక్పథంతో మృతుని కుటుంబాన్ని ఆదుకున్న స్నేహితుల ఔధర్యాన్ని గ్రామస్తులు అభినందించారు. తన భర్త స్నేహితులు అందించిన సహాయం పట్ల భార్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మిత్రబృందం సభ్యులు మాట్లాడుతూ.. కుటుంబానికి ఎల్లవేళలా సహాయ, సహకారాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News