ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
మండల విద్యాశాఖాధికారి ఎం.అనురాధ.
నేటి సాక్షి, నల్లబెల్లి,జూన్ 14:తెలంగాణ రాష్ట్రంలోని హకీంపేట.కరీంనగర్,అదిలాబాదులో ఉన్న క్రీడా పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 4వ తరగతి ప్రవేశాల కొరకు ది.18-06-2025 న నల్లబెల్లి మండలంలోని కాకతీయ బ్రిలియంట్ స్టార్ లో గల క్రీడా మైదానంలో ఉదయం 9 గంటలకు స్పోర్ట్స్ స్కూల్ లో 4వ తరగతి ప్రవేశానికి సంబంధించిన నల్లబెల్లి మండల స్థాయిలో 9 అంశాలలో శారీరక సామర్థ్యానికి సంబంధించిన ఎంపిక పోటీలు బాల, బాలికలకు నిర్వహించబడును
ఈ ఎంపిక పోటీలలో పాల్గొనదలచిన వారు తేదీ 01-09-2016 నుండి- 31-8-2017 మధ్య జన్మించిన వారై ఉండి,4వ తరగతి చదువుతున్నవారు అర్హులు. ఆసక్తి కలిగిన విద్యార్థినీ, విద్యార్థులు ఈ నెల15 తేదీ సాయంత్రం 5 గంటల లోపు తప్పనిసరిగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని, అన్ని ధ్రువీకరణ పత్రాలతో ఈ పోటీలలో పాల్గొనాలని, మండల స్థాయిలో అత్యంత ప్రతిభ చూపిన వారిని జిల్లా స్థాయి పోటీలకు పంపబడునని, కావున ఈ అవకాశాన్ని మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థిని,విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను కోరుతున్నామని నల్లబెల్లి మండల విద్యాశాఖాధికారి ఎమ్. అనురాధ తెలిపారు.

