*నేటి సాక్షి-మేడిపల్లి* మేడిపల్లి మండల కేంద్రంలోని స్మశాన వాటికలో గత కొంతకాలంగా ఉన్న నీటి ఎద్దడి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామ సర్పంచ్ మకిలీ దాస్ గ్రామ పాలకవర్గ సభ్యుల ప్రత్యేక చొరవతో ఈరోజు నూతనంగా బోర్ వేయడం జరిగింది.చిరకాల కోరిక నెరవేరుస్తూ అంత్యక్రియల సమయంలో నీరు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.పాలకవర్గ కృషి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా నిధులు కేటాయించి సర్పంచ్ మకిలి దాస్ స్వయంగా పనులను దగ్గరుండి పర్యవేక్షించారు ప్రజల హర్షం ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు సర్పంచ్ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి, వాటిని సకాలంలో పరిష్కరించడమే లక్ష్యంగా ఈ బోర్వెల్ పనులు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తోపారపు అర్జున్, పంచాయతీ కార్యదర్శి అజయ్ రాజు, కారోబార్ సురేష్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు దేశవేని కృష్ణ,వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.





