Friday, March 20, 2026

*స్లేట్ హైస్కూల్లో మాక్ ఎన్నికలు*—————————————-

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)…………………………………… జగిత్యాల జిల్లా కేంద్రం మిషన్ కాంపౌండ్ లో గల స్లేట్ హైస్కూల్లో శుక్రవారం నాడు మాక్ ఎన్నికలు నిర్వహించారు.ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులు మాక్ ఎన్నికల ప్రక్రియ తెలియజేశారు.ఎన్నికల ప్రకటన,నామినేషన్ల దాకాలు, నామినేషన్ల పరిశీలన, ఓటింగ్ ఫలితాలు ఇలా ప్రజాస్వామ్య పాలనకు ఓటు హక్కు అనేది ఎంత ప్రాధాన్యమో తెలియజేశారు. తదనంతరం ప్రధానోపాధ్యాయురాలు స్వప్న మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాముఖ్యతను,విశిష్టతను , వీటితోపాటు ప్రజాస్వామ్య విలువలను హక్కులను తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జగన్మోహన్ రెడ్డి, డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, రాజ్యలక్ష్మి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News