ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):
స్వంత ఇంటి కలను ఇందిరమ్మ ప్రభుత్వం సాకారం చేస్తుందనీ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..బుధవారం చంధుర్తి మండలం సనుగుల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు..అనంతరం యాదవ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చౌడలమ్మ కళ్యాణ మహోత్సవం పాల్గొని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు…
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకొనేవారు 400 sft తగ్గకుండా 600 sft మించ కుండా నిర్మాణం చేసుకోవాలని, ఇంటి నిర్మాణాo మొదలు పెట్టిన నాటి నుండి దశల వారీగా నిధులు మీ మీ బ్యాంకు ఖాతాలో పడటం జరుగుతుందన్నారు..
ప్రజా ప్రభుత్వం ఎర్పాటు అయిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అమలు చేస్తూ ముందుకు పోతున్నామన్నారు.. అందులో భాగంగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,200 ఉచిత విద్యుత్,500 సిలిండర్,10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ,2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు… ప్రజా ప్రభుత్వం ఏం చేసింది అనే వారికి ఈ పథకాలు అమలు చెంప పెట్టులాంటిదన్నారు..
ఎన్నికలప్పుడు మ్యానిఫెస్టోలో పెట్టకున్నా సన్నం బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందనీ అన్నారు..దేశంలో పేద ప్రజలకు ఉపయోగపడే ప్రతి ఒక్క పథకాన్ని ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే అన్నారు..

