Wednesday, March 18, 2026

*స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు ఉపయోగకరం** ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు

నేటి సాక్షి,బాపట్ల జిల్లా (కర్ల పాలెం)స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు ఉపయోగకరం అని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సెగ్మెంట్ లోని కొత్త నందాయపాలెం మరియు నల్లమోతువారిపాలెం గ్రామాలలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాలలో నాయకులతో కలిసి పాల్గొని గ్రామస్తులు మరియు ఉద్యోగస్తుల చేత స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించి గ్రామాలలో నిర్వహించిన అవగాహన ర్యాలీలలో పాల్గొన్న ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు మరియు రాష్ట్ర మాజీ సైనికుల అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు, కొత్త నందాయ పాలెం గ్రామంలో నిర్వహించిన ర్యాలీ అనంతరం సర్పంచ్ ఆట్ల వెంకటేశ్వరమ్మ అయ్యప్ప రెడ్డి తో కలిసి పారిశుద్ధ్య కార్మికులకు మాస్క్ లు, గ్లౌజ్ లు, హెల్మెట్ లతో కూడిన పారిశుధ్య కిట్లు అందించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ, ప్రతి నెలా మూడవ శనివారం రోజున గ్రామాలలో స్వచ్ఛత పై ఉపయోగకరమైన అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకం అని కొనియాడారు. ప్రజలు కూడా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాలలో పాల్గొంటూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచటానికి సహరించాలి అని పిలుపునిచ్చారు.కార్యక్రమాలలో టీడీపీ సీనియర్ నాయకులు ఆట్ల అయ్యప్ప రెడ్డి, నల్లమోతువారిపాలెం టీడీపీ యూనిట్ ఇంచార్జి మాడా శ్రీనివాసరావు, జనసేన ఇంచార్జి గరిగంటి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు షేక్ షాహిన్, ఆట్ల మురళి రెడ్డి లు, సచివాలయం సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News