నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): అమెరికా-డల్లాస్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవిర్బావ వేడుకలకు ముఖ్య అతిథులుగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకాగా వీరిలో తాజా మాజీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. దాదాపు 18 రోజుల పాటు సాగిన పర్యటన అనంతరం శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా తరలి వెళ్లి ఆయనకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ పర్యటనలో తెలంగాణ రాష్ట్ర అవిర్బావ వేడుకల్లో పాల్గొనడంతో పాటు పలు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రవాసీలతో సమావేశాలు నిర్వహించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కృషిని, సాధించిన రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో అభివృద్ధి జరిపిన తీరును వివరించి, తిరిగి మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ సర్కారే నని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో మీ వంతు పాత్ర, సహకారం అందించాలని కోరినట్లు కొప్పుల వెల్లడించారు. స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర నాయకులు వోరుగంటి రమణ రావు, ముత్యాల బలరాం రెడ్డి, మోహన్ రెడ్డి, ఎలేటి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు సింహచలం జగన్, రాచూరి శ్రీధర్, చల్లూరి రామచంద్రం, మాజీ ఎంపీటీసీ గాజుల మల్లేశం, మాజీ సర్పంచ్ మారం జలేంధర్ రెడ్డి, మెతుకు స్వామి, అనుమండ్ల తిరుపతి, నాయకులు పడిదం వెంకటేష్, దేవి నళిని కాంత్, కూరపాటి శ్రీనివాస్, ఆవుల శ్రీనివాస్, మారం జగన్ మోహన్ రెడ్డి, గాధం భాస్కర్, చింతల తిరుపతి, మెరుగు జానీ, దేవి రాజేంధర్ తదితరులు ఉన్నారు.

