నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 12పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం లోగల సమావేశ భవనంలో డిపిఓ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.ఏపీ ప్రభుత్వం స్వామిత్వ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్వామిత్వ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వారి ఆస్తులపై యాజమాన్య హక్కులు కల్పిస్తారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరును ఏపీ డిపిఓ సుధాకర్ సమీక్షించారు. వచ్చే మార్చి నాటికి కోటి మందికి స్వామిత్వ పథకం కింద ప్రాపర్టీ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.సర్వే వేగంగా పూర్తి చేసేందుకు గ్రామ సర్వేయర్ల సహాకారాలు అందివ్వాలని అన్నారు.రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు, స్థలాలకు యాజమాన్య హక్కులు అందించేందుకు చేపట్టిన స్వామిత్వ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆస్తులకు యాజమాన్య హక్కులు అందించే స్వామిత్వ పథకాన్ని వేగవంతం చేయాలని ఆయన అన్నారు. స్వామిత్వ పథకం ద్వారా 2026 మార్చి నాటికి పూర్తిచేయాలని,.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై డివిజన్ పంచాయతీ అధికారి శుక్రవారం సమీక్షించారు.ఈ క్రమంలోనే స్వామిత్వ మొదటి విడత కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకూ కొన్ని గ్రామాల్లో సర్వే పూర్తి చేసినట్లు అధికారులు.సర్వే పూర్తయిన గ్రామాల్లో యాజమాన్య పత్రాలు అందించనున్నట్లు తెలిపారు.స్వామిత్వ పథకం రెండో విడత కింద కొన్ని గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి,నవంబర్ నెలాఖరుకి యాజమాన్య హక్కు పత్రాలు సిద్దమయ్యాయని తెలియజేశారు.మరోవైపు డిసెంబర్ నుంచి మూడో విడత ప్రారంభించాలన్న డిపిఓ సుధాకర్ అన్నారు.మిగిలిన గ్రామాల్లో సర్వే పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.ఇందుకోసం గ్రామ సర్వేయర్ల సేవలను పంచాయతీరాజ్ శాఖకు కేటాయించే ఏర్పాటు చేయాలని సూచించారు.పంచాయతీరాజ్ శాఖ, సర్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ స్వామిత్వ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.





