నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణ శివారులోని అయ్యప్ప గుట్ట శనివారం ‘శరణుఘోష’తో పులకించిపోయింది.అయ్యప్ప జాతర సందర్భంగా ఉదయం నుంచే ‘… స్వామియేయ్ శరణమయ్యప్పా’న్న నామస్మరణతో అలరారింది.*కేరళ సంప్రదాయ పద్ధతిలో..*కేరళ రాష్ట్రంలోని శబరిమలై పుణ్యక్షేత్రంలో జరిపే మండల పూజను పురస్కరించుకొని జాత రమహోత్సవాన్ని పట్టణంలోని అయ్యప్ప గుట్టపై కొలువైన ‘జ్ఞాన సరస్వతి-శనైశ్చరస్వామి సమేత అయ్యప్ప దేవాలయంలో శనివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ పూజారుల మంత్రోత్చరణల మధ్య ఆలయ అభివృద్ధి కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో ‘పదునెట్టాంబడి’ మహోత్సవం భక్తుల కరతాళధ్వనుల మధ్య చూడముచ్చటగా సాగింది. జాతర మహోత్సవానికి కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు హాజరై అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నారు. ఉదయం దేవాలయంలో అయ్యప్ప, సుబ్ర హ్మణ్యం, గణపతి స్వామి ఉత్సవ మూర్తులకు అర్చనలు, పంచామృత అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పదునెట్టాంబడికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులను అందించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన మహోత్సవ కార్యక్రమాన్ని నర్సింగరావుతో పాటు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నం లావణ్య-అనిల్ లు ప్రారం భించారు. అయ్యప్ప ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక రథం ద్వారా అయ్యప్పగుట్ట ప్రాంతంలో రథయాత్ర నిర్వహించారు. ఈ శోభయాత్రకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంతంలో మహిషి మర్థనం నిర్వహించారు. స్వామి వారికి పట్టణంలోని వివిధ దే వాలయాలు, అయ్యప్ప నిలయాల సభ్యులు, కుల సంఘాల సభ్యులు స్వామి వారికి వస్తాలను బహుకరించి మొక్కులు చెల్లించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కా ర్యక్రమంలో జ్ఞాన సరస్వతి, శనైశ్వర స్వామి అయ్యప్ప దేవాలయ అ య్యప్ప అభివృద్ది కమిటి గౌరవ అధ్యక్షుడు చిద్రాల నారాయణ, అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ సభ్యులు పాల్గొన్నారు.*పోలీసుల భారీ బందోబస్తు… సీసీ పుటేజీల ద్వార ప్రత్యేక పరవేక్షణ*అయ్యప్ప జాతర మహోత్సవానికి కోరుట్ల సర్కిల్ పరిధిలోని పోలీ సులు ప్రత్యేక బందోబస్తును నిర్వహించారు. సీఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో కోరుట్ల, కథలాపూర్ ఎస్‌ఐలు చిరంజీవి, రాంచందర్‌లు పో లీసులు బారీ బందోబస్తును నిర్వహించారు. సీసీ పుటేజీల ద్వార పర్యవేక్షించారు.*జాతరకు 50 వేల మందికి పైగా హాజరు*అయ్యప్ప జాతరకు పలు ప్రాంతాల నుంచి దాదాపు 50 వేల మంది భక్తులు హాజరయ్యారు.వీరికి ఆలయ నిర్వాహకులు అన్నదానం చేశారు.కుటుంబాలతో హాజరైన భక్తులు సంబరంగా గడిపారు.ఎటుచూసినా ‘అయ్యప్ప గుట్ట’ భక్తులతో కిటకిటలాడింది.!——-

