Monday, February 16, 2026

*స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సర్పంచ్*

*నేటి సాక్షి-మేడిపల్లి* మేడిపల్లి మండల కేంద్రంలోని ఓంకారేశ్వర స్వామి ఆలయంలో పట్టు వస్త్రాల సమర్పించిన గ్రామ సర్పంచ్ గ్రామ పాలకవర్గ సభ్యులు పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు వేద ఆశీర్వచనం అందించిన ఆలయ పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య వీరికి స్వాగతం పలికారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు మేడిపల్లి గ్రామ ప్రజల క్షేమం ఆయురారోగ్యాలతో పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రత్యేక పూజలు చేసి ఆ మహా శివుని దీవెనలు అలాగే గ్రామ ప్రజల దీవెనలు మాపై ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని ఆ భగవంతున్ని కోరుకున్నట్లు గ్రామ సర్పంచ్ మకిలి దాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తోపారపు అర్జున్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు దేశవేణి కృష్ణ, పంచారి రాజశేఖర్, బాబు గౌడ్, చారి బాబు, హరీష్,అన్సర్, డాక్టర్ రాజేష్, నవీన్, అనిల్, మహేందర్, రూపేష్, శివమాల స్వాములు గ్రామ పాలకవర్గ సభ్యులు భక్తులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News