నేటి సాక్షి చిలుకూరు మండలం చిలుకూరు మండలం ఆచార్యగూడెం గ్రామం లోఈ విశ్వానికే నవ ఉత్తేజాన్ని కలిగించే వ్యక్తి స్వామి వివేకానంద డాక్టర్ NC రంగాచార్యులు స్వామి వివేకానంద 163 వ జయంతి సందర్భంగా నేషనల్ యూత్ డే ఆచార్యులగూడెంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన రంగాచార్యులు గారు వివేకానంద జీవిత చరిత్ర గురించి చెబుతూ చికాగో నగరం లో జరిగిన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు చెబుతూ వివేకానందుడు యొక్క ప్రసంగాన్ని కూలంకషంగా వివరించారు నేటి యువత వివేక నందు స్ఫూర్తిగా తీసుకొని జీవితాల్లో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని సూచించారు రాజకీయాలకతీతంగా, సామరస్యంగా వివేకానందుని జయంతి కార్యక్రమం జరుపుకోవడం గొప్ప విశేషం అని ఈ గొప్పతనం గ్రామ ప్రజలకు చెందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొని వివేకానందుని చిత్రపటానికి పూల మాలలు వేశారు

