నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)టీటీడీకి చెందిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాళహస్తి మండలంలోని టిఎంవి కండ్రిగ గ్రామంలో, రామచంద్రాపురం మండలంలోని సొరకాయలపాళెం గ్రామంలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు ఎంపేడు పిహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ సుధీర్ కుమార్, కమ్మపల్లి పిహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ టి.ఛత్రప్రకాష్ రెడ్డి తెలిపారు. ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ముందస్తు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి. బిపి, షుగరు పరీక్షలతోపాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు.స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటి మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె.నాగరాజ్, నోడల్ ఆఫీసర్లు డాక్టర్ టివిడి.ప్రత్యూష, డాక్టర్ ఎం.లలిత్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సయ్యద్ జుబేర్, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పద్మావతి, డాక్టర్ హరిత, ఎంపిహెచ్ఈఓ రమేష్, సూపర్వైజర్ సుబ్రమణ్యం, ఎంఎల్ హెచ్ పి వి.అనూరాధ, ఏఎన్ఎం రమాదేవి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

