Saturday, March 14, 2026

*స్విమ్స్ కార్మికులకు అధికారులు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.* *స్విమ్స్ డైరెక్టర్ కు కార్మికులు సామూహిక వినతి.*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) తిరుపతి లోని స్విమ్స్ కార్మికుల సమస్యలు గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నది. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని పలుదపాలు అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాలేదు. నేడు స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి. స్విమ్స్ డైరెక్టర్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం, స్విమ్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె వేణుగోపాల్, నగర సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు పి. బుజ్జి, ఎన్ మాధవ్, ఆనంద్ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్విమ్స్ ఆస్పత్రిలో 800 మంది కార్మికుల సమస్యలు మూడు సంవత్సరాలుగా కొనసాగుతుంటే యాజమాన్యం పరిష్కరించకుండా చోద్యం చూస్తుందని విమర్శించారు. గత జూన్ నెలలో కార్మికులు అధికారులకు సమస్యలు చెప్పి చెప్పి విసిగిపోయి సమ్మె నోటీసులు ఇచ్చి సమ్మె చేయడం జరిగింది. సమస్యల పరిష్కరించాల్సిన స్విమ్స్ యాజమాన్యం టీటీడీ యాజమాన్యం సమస్యను పరిష్కరించకుండా మరింత జఠిలం చేశారన్నారు. ఎస్మా ప్రయోగిస్తాం సమ్మెలో ఉన్న కార్మికులు విధుల్లోకి చేరకుంటే విధుల నుంచి బహిష్కరిస్తామని బెదిరింపులకు పూనుకున్నారు. అయితే బెదిరింపులు లెక్కచేయని కార్మికులు ఎమర్జెన్సీ మినహా మిగిలిన వార్డులన్నీ విధులు బహిష్కరించి బైఠాయించడం జరిగిందని అన్నారు. ఈ పోరాటం నగరం అంతా చర్చినియంసమైంది, ఏమైపోతుందో అన్న ఆందోళనలో ప్రభుత్వ అధికారులు ఆర్డీవో, ఏ ఎస్ పి జోక్యం చేసుకొని టీటీడీ స్విమ్స్ యాజమాన్యాలతో చర్చలు జరిపి మూడు మాసాల గడువు కావాలని ఈ మూడు మాసాలలో శానిటేషన్ పేరు తొలగించి కార్మికులకు జీతాలు పెంచుతామని సమ్మె కాలంలో కార్మికులు పెట్టిన అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు ఇచ్చిన గడువు మూడు మాసాలు దాటిపోయి మూడు వారాలు పూర్తయింది. అయినా అధికారులు ఎంతవరకు సమస్యను ముందుకు తీసుకుపోయి పరిష్కరించకుండా ఆలస్యం చేస్తున్నారని ఇప్పటికైనా సమస్య పరిష్కారం కావాలని కార్మికులందరూ పెద్ద ఎత్తున సామూహిక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అధికారులు ఇచ్చిన హామీలు నిద్రమత్తులో మరిచిపోయారేమో లేక పరిష్కారం చేయకూడదని ఉద్దేశంతో ఉన్నారో ఏమో తెలియడం లేదు కానీ మీరు ఇచ్చిన గడువు పూర్తయింది మా సమస్యలు పరిష్కారం చేయాలని అధికారులకు గుర్తు చేయడం జరిగిందని అన్నారు. ధర్నా అనంతరం స్విమ్స్ డైరెక్టర్, మెడికల్ సూపరింటెండెంట్, టీటీడీ అకౌంటెంట్, కార్మికులు చేస్తున్న ధర్నా వద్దకు వచ్చి ఈ సమస్యపై యస్కీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని వాళ్లు రిపోర్టు టిటిడి కి ఇచ్చారని ఈ సమస్య చివరి దశలో ఉంది అతి తొందరలో ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని శానిటేషన్ పదాన్ని తొలగించి కార్మికులకు న్యాయం చేస్తామని సమ్మె కాలం డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వారిచ్చిన హామీతో ధర్నా కార్యక్రమం విరమించడం జరిగింది. ఈ సమస్య త్వరగా పరిష్కరించకపోతే మరల మరో పోరాటానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని సిఐటియు నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి జి రవి, అధ్యక్షులు వి సూరి, కోశాధికారి మారి ముత్తు, నాయకులు గోపి, రత్న వేలు, జనార్ధన్, కోటయ్య, జయమ్మ, కుమారి, ఎం సుబ్బు యాదవ్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News