నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి ఫిబ్రవరి 11 హత్యాయత్నం కేసులో వ్యక్తిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై నాగేశ్వరావు తెలిపారు. ఆయన కథనం మేరకు… మండలంలోని దిగువపల్లి పంచాయతీ కు చెందిన గంగులమ్మ సమీప బంధువు తమ్ముడు వరసైన నాగరాజా ఆస్తి విషయమై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి గాయపడ్డ మహిళ ను తిరుపతి రుయాకు తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆమె కోరుకుంటుంది .అక్క పై హత్యాయత్నానికి పాల్పడిన నాగరాజును బుధవారం కొలింపల్లి క్రాస్ లో అరెస్ట్ చేసి పుంగనూరు న్యాయస్థానంలో హాజరుపరచగా జడ్జి నిందితున్ని రిమాండ్ కు ఆదేశించారు.

