నేటి సాక్షి, గన్నేరువరం, ( బుర్ర అంజయ్య గౌడ్):*ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుండి గుండ్లపల్లి జంగాపల్లి హన్మాజిపల్లి పంతులు కొండాపూర్ మైలారం మీదిగా మండల కేంద్రమైన గన్నేరువరం వరకు బస్సు సౌకర్యం కల్పించాలని కరీంనగర్ ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం భూపతిరెడ్డిని కలిసిన హన్మాజిపల్లి సర్పంచ్ నందికొండ అంజిరెడ్డి రోజా దంపతులు శనివారం రోజున కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్మెర రవీందర్ రెడ్డి నందికొండ తిరుపతిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గన్నేరువరం మండల కేంద్రానికి వెళ్లాలన్న రావాలన్న ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. పండించిన కూరగాయలు కరీంనగర్ మార్కెట్ కు వెళ్లాలంటే ప్రైవేట్ వాహనాలు ఆటోలు ఆశ్రయించాల్సిన అవసరం వస్తుందని అన్నారు. సరైన ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక గుండ్లపల్లి నుండి మానస దేవి మైలారం మల్లికార్జున స్వామి పారువేళ్ల లక్ష్మీ గణపతి ఆలయాలకు సరైన వేళలో ఆర్టీసీ బస్సులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. వివిధ గ్రామాలలో వృద్ధులు బడి పిల్లలు కాలేజీ విద్యార్థులు సౌకర్యం మరియు మా గ్రామం మీదుగా వెంటనే ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కరీంనగర్ ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం భూపతిరెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్మెర రవీందర్ రెడ్డి, నందికొండ తిరుపతి రెడ్డి,వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

