నేటిసాక్షి, మిర్యాలగూడ : జెఏసినాయకులు జస్టిస్ ఈశ్వరయ, మాజీ ఐఏఎస్ చిరంజివులు, ధర్మ సమాజ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆధ్వర్యంలో ఈ నెల 15న శనివారం కామారెడ్డిలో ఈనెల 15న జరుగుతున్న బీసీ ఆక్రోష సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలందరూ తరలిరావాలని ధర్మసమాజ్ పార్టీ మండల నాయకులు గద్దల సైదులు మహారాజ్ కోరారు. ఈ సందర్భంగా గురువారం దామచర్ల మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దామరచర్ల మండల నాయకులు మేష నాయక్, మల్లికార్జున్, రామ్ కుమార్, దేవేందర్, సైదులు, సత్యం, మహేష్, లక్ష్మణ్, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.





