నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):రాజ్యాంగ హక్కుల సాధన కోసం నవంబర్ 26 న హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జాతీయ మాల మహానాడు చందుర్తి మండల అధ్యక్షులు ఆశీనిపర్తి యేసుకుమార్ అన్నారు. ఈ సందర్బంగా రాజన్న సిరిసిల్లా జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఢిల్లీలో జరిగే రాజ్యాంగ హక్కుల సాధన సభ బుధవారం కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు మాలల రాజ్యాంగ హక్కుల సాధన కోసం హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమం నవంబర్ 26 న నిర్వహించడం జరుగుతుందన్నారు. మాలలపై జరుగుతున్న అక్రమాలను నిలదీస్తూ ,రాజ్యాంగ విరుద్ధంగా జీవో 99 రోస్టర్ విధానాన్ని తిరిగి పునః సమీక్షించాలని, అలాగే ఎస్సీ రిజర్వేషన్ 15 నుంచి 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని, భారత కరెన్సీ నోట్ల పై అంబేద్కర్ చిత్రం ముద్రించాలని పేర్కొన్నారు. అలాగే దేశంలో ఎస్సీ, ఎస్టీల పై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో 41 సిఆర్పి సెక్షన్ ద్వారా నిందితులను అరెస్టు చేసే అవకాశం లేకుండా పోతుందని, వెంటనే 41 సిఆర్పి సెక్షన్ రద్దు చేయాలన్నారు.ఇలాంటి 12 అంశాలతో కూడిన డిమాండ్లతో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు నీరటి శ్రీనివాస్, చందుర్తి మండల అధ్యక్షులు ఆశీనిపర్తి యేసుకుమార్, ఉపాధ్యక్షులు నీరటి. ప్రసాద్,చందుర్తి మాల సంఘం అధ్యక్షులు బత్తుల. శ్రీనివాస్ , ఉపాధ్యక్షలు పాటి జ్యోతికుమార్, మూడపల్లి మాల సంఘం అధ్యక్షులు నీరటి. సురేష్, కార్యవర్గ సభ్యులు,బండ శ్రీనివాస్ ఆశీనిపర్తి సురేష్ బత్తుల అశోక్, బత్తుల ప్రభాకర్, రాగుల సుబ్రహ్మణ్యం, బత్తుల వసంత్, తదితరులు పాల్గొన్నారు.





