నేటి సాక్షి* తిరుమలాయపాలెం మార్చి 8 (మెట్టు రుద్రరాజు ) మండలంలోని హస్నాబాద్ గ్రామంలో మహిళా దినోత్సవ సందర్భంగా గ్రామంలో వివిధ హోదాలలో పనిచేస్తున్న మహిళ మణులను హస్నాబాద్ గ్రామ సర్పంచ్ కొవ్వూరి పద్మ ఉప సర్పంచ్ మాగి బాలకృష్ణ గ్రామ పెద్దలు గ్రామ ప్రజల తో కలిసి సన్మానించుకోవడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు సర్పంచ్ కొవ్వూరి పద్మ, కార్యదర్శి నర్మద, వార్డు సభ్యులు మాగి అనూష, పోతుల సరిత, మాజీ సర్పంచ్ శ్రీపతి ప్రవళిక, అంగన్వాడి టీచర్లు సునీతా, ఉపేంద్ర, గ్రామ దీపిక లు. మామిడాల నర్మదా, అన్నపురెడ్డి రాజేశ్వరి, వివో ఏ అధ్యక్షురాలు మామిడాల, విజయ దుర్గ, ఆశ వర్కర్లు పల్లి రాధిక, బొబ్బిలి భవాని, అంగన్వాడి ఆయాలు కొత్తపల్లి నాగలక్ష్మి, పల్లి శైలజ, గ్రామ బ్యాంక్ మిత్ర సన్నాయిల నిర్మల ఉన్నారు, అదేవిధంగా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు, బండారు పాప రెడ్డి, బండారు సత్తిరెడ్డి, కొవ్వూరు సత్తిరెడ్డి, రామస్వామి ఎల్లయ్య, వార్డ్ మెంబర్ పల్లి గోపి, అనబత్తుల సత్తిబాబు,పల్లి రమేష్, అసలాది నవీన్, పసలాది మధు,మాగి శంకర్ తదితరులు పాల్గొన్నారు.





