*నేటి సాక్షి* తిరుమలాయపాలెం ఫిబ్రవరి 5 ( మెట్టు రుద్రరాజ)తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్ గ్రామంలో గత స్థానిక సంస్థల ఎన్నికల నుంచీ బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తూ, పార్టీపై దుష్ప్రచారం చేస్తూ పార్టీని నిర్వీర్యం చేయడానికి పాల్పడిన హస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు కొత్త వెంకన్న (పాల) ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందనిఈ నిర్ణయం పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆదేశాల మేరకు,ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు & ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సూచనల ప్రకారం,బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భాషబోయిన వీరన్న హస్నాబాద్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో తీసుకున్న పార్టీ నిర్ణయం. నేటి నుండి కొత్త వెంకన్న కు బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధాలు ఉండవని మండల పార్టీ అధ్యక్షుడు భాషబోయిన వీరన్న స్పష్టం చేశారు. అదేవిధంగా, హస్నాబాద్ గ్రామంలో జరిగిన వార్డు నెంబర్ సమావేశంలో బీఆర్ఎస్ వార్డు నాయకుల పై జరిగిన దాడిని పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు మరల జరగకుండా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రానున్న కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా ప్రతి అంశానికి తగిన సమాధానం ఇవ్వబడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భాషబోయిన వీరన్న హస్నాబాద్ సర్పంచ్ కొవ్వూరి పద్మ సత్తిరెడ్డి ,చంద్రు తండా మాజీ సర్పంచ్ బోడ మంచా నాయక్,మండల పార్టీ మైనార్టీ అధ్యక్షులు,గోల్ తండా ఉపసర్పంచ్ చందు షేక్, పోట్ల జగదీష్, వేణు, సందీప్ రెడ్డి, మాగి వెంకన్న, మోటబోతుల పద్మప్రియ శ్రీను, తండా అంజయ్య, పల్లి వినోద్, కొత్తపల్లి వెంకటరెడ్డి, సీతారామరెడ్డి, కాశి మల్ల మహేందర్, మాగి లక్ష్మయ్య, పల్లి భాస్కర్, పసలాది రవి, గుండ గాని వీరన్న గౌడ్, మాగి సతీష్ తదితరులు పాల్గొన్నారు..





